నా ఆనందపు అనుభూతుల్లో నేను వూరేగుతుండగా స్వర్గాధిపతినుండి పిలుపు వచ్చింది. వారి ముందు హాజరై చేతులు జోడించాను. “నిన్ను స్వర్గలోకంనుండి నరకలోకమునకు బదిలీ చేయడమైనది,” అని స్వర్గాధిపతి మాట వినేసరికి నా గుండె గొంతులోకి కాదు, యేకంగా నోట్లోకి వచ్చేసింది.
బమ్మిడి జగదీశ్వరరావు
- పూర్తిపేరు
- బమ్మిడి జగదీశ్వరరావు
- ఇతరపేర్లు
- బజరా
- సొంత ఊరు
- కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా
- ప్రస్తుత నివాసం
- హైదరాబాద్
- వృత్తి
- వృత్తి ప్రవృత్తి రచనే
- ఇష్టమైన రచయితలు
- కారా రావిశాస్త్రిల నుండి కెఎన్వై పతంజలి దాక యెందరో...
- హాబీలు
- సాహిత్యం, సినిమా- హాబీ కాదు జీవితమే అది.
జీవిత విశేషాలు
తొమ్మిది కథాసంపుటాలు, ఆరు జానపద కథాసంపుటాలు వెలువరించడంతోబాటు ఏడు వందలకు పైగా కథలు రాశి, అనేక కథాకాలమ్స్ నిర్వహించిన బమ్మిడి జగదీశ్వరరావుగారి రచనలు కొన్ని హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ భాషలలోకి కూడా అనువదితమయ్యాయి. కొన్ని సినిమాలకూ డాక్యుమెంటరీలకూ రచయితగా పనిచేశారు